శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రీఫండ్ సమయం పెంపు.!

లాక్‌డౌన్ సాయంలో ఆర్జిత సేవల టికెట్లు కొనుగోలు చేసినవారికి టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. ఆ టికెట్ల డబ్బు రీఫండ్ తీసుకునే సమయాన్ని డిసెంబర్ 31

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రీఫండ్ సమయం పెంపు.!
T

Updated on: Oct 28, 2020 | 6:14 PM

TTD Money Refund: లాక్‌డౌన్ సాయంలో ఆర్జిత సేవల టికెట్లు కొనుగోలు చేసినవారికి టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. ఆ టికెట్ల డబ్బు రీఫండ్ తీసుకునే సమయాన్ని డిసెంబర్ 31 వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే లాక్‌డౌన్ సమయంలో ఆర్జిత సేవల్లో పాల్గొనని భక్తులకు రద్దు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతిని రద్దు చేసుకోవచ్చునని తెలిపింది.

కాగా, నవంబర్ నెలకు గాను రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ తమ అఫిషియల్ వెబ్‌సైట్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. రోజుకు 19 వేల టికెట్లు చొప్పున ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 19 స్లాట్లలో టికెట్లను భక్తులకు ఇవ్వనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Also Read:

ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్‌మ్యాన్.!

మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..

భక్తులకు శుభవార్త.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..