తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె తప్పదా? జేఏసీతో రెండో దఫా చర్చలు విఫలం

| Edited By:

Oct 03, 2019 | 5:50 PM

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ యూనియన్లు సమ్మె నోటీసు ఇవ్వడంతో ప్రభుత్వం జరిపిన రెండో దఫా చర్చలు కూడా విఫలమయ్యాయి. గురువారం జరిగిన ఈ చర్చల్లో ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి స్పందన రాలేదని యూనియన్ నాయకులు వెల్లడించారు. దీంతో టీఎస్ఆర్టీసీ జేఏసీతో త్రిసభ్య కమిటీ జరిపిన చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటికే జేఏసీ సమ్మెనోటీసు ఇవ్వడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పట్లు చేస్తుండటంతో […]

తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె తప్పదా?  జేఏసీతో రెండో దఫా చర్చలు విఫలం
TSRTC
Follow us on

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ యూనియన్లు సమ్మె నోటీసు ఇవ్వడంతో ప్రభుత్వం జరిపిన రెండో దఫా చర్చలు కూడా విఫలమయ్యాయి. గురువారం జరిగిన ఈ చర్చల్లో ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి స్పందన రాలేదని యూనియన్ నాయకులు వెల్లడించారు. దీంతో టీఎస్ఆర్టీసీ జేఏసీతో త్రిసభ్య కమిటీ జరిపిన చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

ఇప్పటికే జేఏసీ సమ్మెనోటీసు ఇవ్వడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పట్లు చేస్తుండటంతో యూనియన్లకు ఆగ్రహం తెప్పించింది. ఒకవైపు చర్చలు సాగిస్తూ మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం జరిగిన చర్చల నుంచి జేఏసీ నేతలు మధ్యలోనే వెళ్లిపోయారు. కార్మిక సంఘాలు వెంటనే సమ్మెను విరమించుకోవాలని, పండుగ రోజుల్లో ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా సామరస్యపూర్వకంగా ఆలోచించాలని కమిటీ విఙ్ఞప్తి చేసింది. అయితే తమ ప్రధాన డిమాండ్‌లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని జేఏసీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత వస్తేనే తాము సమ్మె విరమణపై నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు.

ఇదిలా ఉంటే టీఎస్ఆర్టీసీ యూనియన్లు సమ్మె నోటీసు ఇవ్వడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఒకవేళ చర్చలు సఫలం కాకపోతే ఏమిటన్న దానిపై ఆలోచిస్తోంది. ఒకవేళ సమ్మె తప్పనిసరి అయితే ప్రైవేటు స్కూలు బస్సుల డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు నడిపే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా సమాచారం.