నగరవాసులకు ‘చల్లటి’ కబురు.. తగ్గనున్న సిటీ బస్సు ఛార్జీలు..!

నగరవాసులకు ఆర్టీసీ చల్లటి కబురు చెప్పనుంది. సిటీ ఏసీ మెట్రో బస్సు ఛార్జీలను తగ్గించే యోచనలో ఆర్టీసీ ఉన్నట్లు తెలుస్తోంది. ధరలను ఏమేరకు తగ్గించాలనే ప్రాతిపదికను అధికారులు ఇప్పటికే ఎండీ సునీల్ శర్మకు పంపినట్లు తెలుస్తోంది. అయన ఆమోదం తెలిపిన వెంటనే న్యూ ఇయర్ రోజు నుంచి కొత్త ఛార్జీలను అమలులోకి తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో ఏసీ బస్సులు మొత్తంగా 80 తిరుగుతున్నాయి. ఉప్పల్-వేవ్‌రాక్, లింగంపల్లి-ఎల్‌బీనగర్, లింగంపల్లి-దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్- అర్జీఐ ఎయిర్‌పోర్ట్, సికింద్రాబాద్‌- ఎల్‌బీనగర్‌‌కు […]

నగరవాసులకు చల్లటి కబురు.. తగ్గనున్న సిటీ బస్సు ఛార్జీలు..!

Updated on: Dec 26, 2019 | 4:02 PM

నగరవాసులకు ఆర్టీసీ చల్లటి కబురు చెప్పనుంది. సిటీ ఏసీ మెట్రో బస్సు ఛార్జీలను తగ్గించే యోచనలో ఆర్టీసీ ఉన్నట్లు తెలుస్తోంది. ధరలను ఏమేరకు తగ్గించాలనే ప్రాతిపదికను అధికారులు ఇప్పటికే ఎండీ సునీల్ శర్మకు పంపినట్లు తెలుస్తోంది. అయన ఆమోదం తెలిపిన వెంటనే న్యూ ఇయర్ రోజు నుంచి కొత్త ఛార్జీలను అమలులోకి తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో ఏసీ బస్సులు మొత్తంగా 80 తిరుగుతున్నాయి. ఉప్పల్-వేవ్‌రాక్, లింగంపల్లి-ఎల్‌బీనగర్, లింగంపల్లి-దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్- అర్జీఐ ఎయిర్‌పోర్ట్, సికింద్రాబాద్‌- ఎల్‌బీనగర్‌‌కు సర్వీసులు నడుస్తున్నాయి. ఇటీవల ఆర్టీసీ ఛార్జీలను ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో ఏసీ బస్సు ఫేర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాకుండా మెట్రో ఛార్జీ మియాపూర్ నుంచి సికింద్రాబాద్, ఎల్‌బీనగర్‌‌ రూ.60 ఉండగా.. ప్రజలు ఏసీ బస్సుల కంటే మెట్రో వైపే మొగ్గు చూపుతున్నారు. అందువల్లే ఇప్పుడు వీటి రేట్లను తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది.

ఎంత తగ్గించే అవకాశం ఉంది…

లింగంపల్లి నుంచి ఎల్‌బీనగర్‌కు ప్రస్తుతం ఏసీ బస్సు ఛార్జీ రూ.110గా ఉంది. అటు దిల్‌సుఖ్‌నగర్‌కు రూ.80 వసూలు చేస్తున్నారు. ఇక ఉప్పల్ నుంచి వేవ్‌రాక్‌కు కూడా ఇదే ఛార్జీ పడుతోంది. మెట్రో రైలు చార్జీల కంటే ఇది చాలా ఎక్కువ. అందువల్ల ఇకపై రూ 110ని.. రూ.75గా.. రూ.80 టికెట్‌ను రూ.50గా చేయాలని యోచిస్తున్నారు. నార్మల్ ఫేర్‌ను రూ.20గా ఉంచి.. మూడు స్టాపుల తర్వాత సవరిస్తారట. దీంతో ప్రయాణీకులు ఈ బస్సుల వైపు మళ్ళీ అవకాశం ఉంటుందని ఆర్టీసీ ఆలోచిస్తోంది.