తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్ ఫీజులు పెంచమన్న ప్రైవేట్ యాజమాన్యాలు..

| Edited By:

Apr 20, 2020 | 6:31 PM

లాక్ డౌన్ నేపథ్యంలో.. తెలంగాణ విద్యాశాఖపై మంత్రి సబితారెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. సెట్‌ల నిర్వహణ, ఇంటర్ వాల్యుయేషన్, పదో తరగతి పరీక్షలు ఎలా నిర్వహించాలన్నదానిపై విస్తృత చర్చ జరుగుతోంది. ఫీజులపై ప్రయివేటు

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్ ఫీజులు పెంచమన్న ప్రైవేట్ యాజమాన్యాలు..
Follow us on

లాక్ డౌన్ నేపథ్యంలో.. తెలంగాణ విద్యాశాఖపై మంత్రి సబితారెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. సెట్‌ల నిర్వహణ, ఇంటర్ వాల్యుయేషన్, పదో తరగతి పరీక్షలు ఎలా నిర్వహించాలన్నదానిపై విస్తృత చర్చ జరుగుతోంది. ఫీజులపై ప్రయివేటు విద్యాసంస్థలకు ఇవ్వాల్సిన ఆదేశాలపై చర్చ జరుగుతోంది. ఈ సమీక్షలో ఉన్నత విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు. కాగా.. స్కూల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు శుభవార్త చెప్పాయి. కరోనా నేపథ్యంలో స్కూల్ ఫీజులు పెంచడం లేదని , ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకుంటామని తెలిపాయి.

Also Read: రూ.500కే కరోనా టెస్టింగ్ కిట్.. 15 నిమిషాల్లో ఫలితం..