రూ.500కే కరోనా టెస్టింగ్ కిట్.. 15 నిమిషాల్లో ఫలితం..

కోవిద్-19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనే దిశగా.. ఎన్నో దేశాలు తమవంతు కృషి చేస్తున్నాయి. అయితే.. అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థి నదీమ్‌ రెహ్మాన్‌ స్వదేశీ పరిజ్ఞానంతో

రూ.500కే కరోనా టెస్టింగ్ కిట్.. 15 నిమిషాల్లో ఫలితం..
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2020 | 3:23 PM

కోవిద్-19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనే దిశగా.. ఎన్నో దేశాలు తమవంతు కృషి చేస్తున్నాయి. అయితే.. అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థి నదీమ్‌ రెహ్మాన్‌ స్వదేశీ పరిజ్ఞానంతో యాంటీ బాడీ కరోనా వైరస్‌ టెస్టింగ్‌ కిట్‌ అభివృద్ధి చేశాడు. దీని ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే కరోనాను నిర్ధారించవచ్చు. ఈ కిట్‌ ధర 500 నుంచి 600 రూపాయల మధ్యలో ఉండొచ్చు. ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తే వీటి ధర మరింత తగ్గొచ్చు.

కాగా.. ఫింగర్‌ ఫ్రీక్‌ విధానంలో ఈ కిట్‌ ద్వారా కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఆర్‌టీ – పీసీఆర్‌ కంటే ఇవి చాలా చౌక. అంతేకాకుండా ప్రస్తుతం పరీక్షలు నిర్ధారణలో పాథాలజీ విభాగంపై విపరీతమైన ఒత్తిడి ఉంటోంది. దీంతో ఈ విభాగంపై ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ఈ కిట్లు ఉపయుక్తంగా ఉంటాయి. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ ఆమోదించిన ఈ కిట్ల ఉత్పత్తిని త్వరలోనే ప్రారంభిస్తామని, సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి తెస్తామని నదీమ్‌ రెహ్మాన్‌ తెలిపారు.