28 April 2024
సినిమాల్లోకి వచ్చాక శ్రీలీల ఎంత సంపాదించిందో తెలుసా
Rajitha Chanti
Pic credit - Instagram
గతేడాది తెలుగు సినిమాల్లో ఎక్కువగా వినిపించిన పేరు శ్రీలీల. ఒకే సంవత్సరం ఏకంగా అరడజనుకుపైగా సినిమాలను ప్రకటించింది.
పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి.
కానీ ఈ అమ్మడు ఖాతాలో అటు డిజాస్టర్స్ కూడా వచ్చి చేరాయి. ఈ ఏడాది గుంటూరు కారం సినిమా తర్వాత లాంగ్ టైమ్ బ్రేక్ తీసుకుంది.
కేవలం ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుంది శ్రీలీల. అయితే ఈ బ్యూటీ గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.
2001 జూన్ 14న జన్మించింది శ్రీలీల. చిన్నతనంలోనే భారతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతుంది ఈ హీరోయిన్.
ప్రస్తుతం శ్రీలీలకు ఇన్ స్టాలో 5.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఈ అందాల రాశి నెట్టింట 114 మందిని ఫాలో అవుతుంది.
తాజాగా నెట్టింట వినిపిస్తున్న సమాచారం ప్రకారం సినిమాల్లోకి వచ్చిన తర్వాత శ్రీలీల నికర విలువ దాదాపు రూ. 10 కోట్లు వరకు ఉంటుందట.
సియాసత్ డైలీలో వచ్చిన కథనం ప్రకారం ఒక సినిమాకు శ్రీలీల రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం.
ఇక్కడ క్లిక్ చేయండి.