క్రైమ్‌పై కొత్త ఆయుధం.. ట్రాక్‌తో అనుసంధానం: డీజీపీ

| Edited By:

Jan 17, 2020 | 4:54 PM

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారా రాష్ట్రంలో నేరాలను నియంత్రించవచ్చని అన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. అలాగే ట్రాఫిక్ వ్యవస్థను మెరుగు పర్చేందుకు కూడా కృషి చేస్తున్నామని, అందుకు తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్‌ (ట్రాక్)‌తో పోలీస్ శాఖ ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. పెరుగుతున్న నేరాలపై ఎలాంటి కౌన్సిలింగ్స్ ఇచ్చినా క్రిమినల్స్‌లో మార్పులు రావడం లేదు. ఈ ట్రాక్ పరిజ్ఞానం ద్వారా రాష్ట్రంలో నేరాలు, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, బహిరంగంగా […]

క్రైమ్‌పై కొత్త ఆయుధం.. ట్రాక్‌తో అనుసంధానం: డీజీపీ
Follow us on

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారా రాష్ట్రంలో నేరాలను నియంత్రించవచ్చని అన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. అలాగే ట్రాఫిక్ వ్యవస్థను మెరుగు పర్చేందుకు కూడా కృషి చేస్తున్నామని, అందుకు తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్‌ (ట్రాక్)‌తో పోలీస్ శాఖ ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. పెరుగుతున్న నేరాలపై ఎలాంటి కౌన్సిలింగ్స్ ఇచ్చినా క్రిమినల్స్‌లో మార్పులు రావడం లేదు. ఈ ట్రాక్ పరిజ్ఞానం ద్వారా రాష్ట్రంలో నేరాలు, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, బహిరంగంగా మద్యం తాగే ప్రాంతాలను మ్యాపింగ్ చేస్తున్నామన్నారు. వీటితో సదరు నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. అలాగే.. పోలీస్ శాఖకు ఉన్న ఖాళీ స్థలాలు, కార్యాలయ భవనాలు, పోలీస్ స్టేషన్ల సరిహద్దులను రెవెన్యూ రికార్డులతో అనుసంధానం చేసి మ్యాపింగ్ ప్రక్రియ చేస్తామన్నారు. వీటి ద్వారా మహిళలపై జరిగే దాడులను కొంతమేర నియత్రించవచ్చని అన్నారు డీజీపీ. ఇవి అత్యంత పరిజ్ఞానంతో పనిచేస్తాయని.. వీటిపై ప్రత్యేకమైన పోలీస్ టీం నిఘా పెడుతుందని తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి.