కొత్త రకం వైరస్ నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ వైద్యార్యోగ్య శాఖ.. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు.

బ్రిటన్ కేంద్రంగా పురుడుపోసుకున్న కొత్త రకం వైరస్ ప్రపంచాన్ని భయపెట్టిస్తోంది. ఈ క్రమంలో ఈ కొత్త వైరస్‌ను దేశంలోకి రాకుండా అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే...

కొత్త రకం వైరస్ నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ వైద్యార్యోగ్య శాఖ.. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు.
Follow us

|

Updated on: Dec 26, 2020 | 10:05 AM

ts govt toll free number: బ్రిటన్ కేంద్రంగా పురుడుపోసుకున్న కొత్త రకం వైరస్ ప్రపంచాన్ని భయపెట్టిస్తోంది. ఈ క్రమంలో ఈ కొత్త వైరస్‌ను దేశంలోకి రాకుండా అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా డిసెంబర్ 9 తర్వాత బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు వైద్యులకు సహకరించాలని అధికారులు కోరారు. ఎవరైనా బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వస్తే వివరాలను వెంటనే కాల్‌ సెంటర్‌ నంబర్‌ 040-24651119కి ఫోన్‌చేసి చెప్పాలని లేదా 9154170960 నంబర్‌కు వాట్సాప్‌ చేయాలని అధికారులు విజ్ఞప్తిచేశారు. వైద్య సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్‌ విధానాన్ని అవలంబిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి సుమారు 1,200 మంది బ్రిటన్ నుంచి రాగా వారిలో 926 మందని గుర్తించి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో 16 మందికి వైరస్‌ సోకింది. ప్రస్తుతం వీరిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.