కరోనా కట్టడికి స్పెషల్ ఆఫీసర్లు

|

Jul 11, 2020 | 6:18 PM

జీచ్ఎంసీ పరిధిలో విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. జీహెచ్ఎంసీని ఎనిమిది కంటోన్మెంట్ జోన్లుగా విభజించింది. ఇందులో ఐఏఎస్ అధికారులతోపాటు...

కరోనా కట్టడికి స్పెషల్ ఆఫీసర్లు
Follow us on

గ్రేటర్‌లో కరోనా కోరలు చాస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్‌లో కరోనా కట్టడికి ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసింది. కొవిడ్ అధికంగా ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాలను 8 జోన్లుగా విభజించింది. కేసులు అధికంగా వచ్చిన సర్కిళ్లలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తారు. ఆయా కంటోన్మెంట్లకు 8 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించింది.

ఇందులో ముగ్గురు ఐఏఎస్‌లు, ఐదుగురు అడిషనల్ కమిషనర్లు ఉన్నారు. ఇందులో శేరి‌లింగంపల్లికి అడిషనల్ కమిషనర్ యాదగిరిని నియమించింది. సికింద్రాబాద్ జోన్‌కు జయరాజ్, ఖైరతాబాద్ జోన్‌‌కు శంకరయ్య, కార్వాన్ సర్కిల్‌కు జేసీ సంధ్య.. ఛార్మినార్ జోన్‌కు విజయలక్ష్మి, రాజేంద్రనగర్ కంటైన్మెంట్‌కు సంతోష్, కుత్బుల్లాపూర్‌ జోన్‌కు ప్రియాంక నియమించారు.