తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యార్హత పరీక్ష ఎంసెట్ షెడ్యూల్ రిలీజయ్యింది. మే 5, 6, 7 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఎంసెట్‌ను నిర్వహించనున్నారు. మే నెల 9, 11 తారీఖుల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగనుండగా… మే 2న ఈసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇక మే నెల 13వ తేదీ నుంచి పీఈ సెట్ పరీక్షలు జరగనున్నాయి. ఐసెట్ ఎగ్జామ్ మే 20, 21 నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి షెడ్యూల్ విడుదల చేశారు.