వైట్ హౌస్ ను అప్పుడే ఖాళీ చేసిన ఉన్నతాధికారి స్మిత్

అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ ఓటమి దిశగా సాగుతున్నారన్న విషయం ఇంకా  నిర్ధారణ కాక మునుపే వైట్ హౌస్ నుంచి అధికారుల నిష్క్రమణ ప్రారంభమైనట్టు కనిపిస్తోంది.

వైట్ హౌస్ ను అప్పుడే ఖాళీ చేసిన ఉన్నతాధికారి స్మిత్

Edited By: Anil kumar poka

Updated on: Nov 07, 2020 | 1:54 PM

అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ ఓటమి దిశగా సాగుతున్నారన్న విషయం ఇంకా  నిర్ధారణ కాక మునుపే వైట్ హౌస్ నుంచి అధికారుల నిష్క్రమణ ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. శ్వేతసౌధం అత్యున్నత స్థాయి అధికారుల్లో ఒకరైన నల్లజాతీయుడు జా రాన్ స్మిత్ బయటకు వచ్ఛేశారు.  ఎన్నికల ఫలితాలు వెల్లడవుతుండగానే  ట్రెండ్ తెలియడంతో ఈయన నిష్క్రమించారు. మరో సంస్థ అయిన సెంటర్ ఫర్ అడ్వాన్సింగ్ ఆపర్చ్యునిటీ డైరెక్టర్ పదవిని స్మిత్ చేపట్టనున్నారు. 2017 లో వైట్ హౌస్ లో చేరిన స్మిత్ కి  ఇక్కడ మంచి హోదా ఉన్న ఉద్యోగం లభించింది, ట్రంప్  గెలుస్తారన్న నమ్మకం తనకు ఉందని, ఆయన విజయం సాధిస్తారని స్మిత్ అంటున్నారు. కాగా-ఈయన నిష్క్రమణ ప్లాన్ ఇప్పటిది కాదని, చాలాకాలం క్రితమే ఈయనశ్వేత సౌధాన్ని వీడాలన్న నిర్ణయం తీసుకున్నారని ఇతర అధికారులు చెబుతున్నారు. ఏమైనా.. ఈ ఎగ్జిట్ టైమింగ్ అన్నది మాత్రం ఈయన అంతరార్థమేమిటో చెప్పకనే చెబుతోంది.