Trump India Visit: ఇక రక్షణ రంగంలో భారత్-అమెరికా భాయీ.. భాయీ

Umakanth Rao

Umakanth Rao |

Updated on: Feb 25, 2020 | 2:38 PM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఉభయ దేశాల మధ్య కీలకమైన అయిదు ఒప్పందాలు కుదిరాయి. కొన్ని ప్రధాన అంశాల మీద రెండు దేశాల ప్రతినిధిబృందాలూ ఎం ఓ యుల పై సంతకాలు చేశాయి. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి 3 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదరడం విశేషం. ఈ అగ్రిమెంట్ కింద ఇండియా.. అమెరికా నుంచి అత్యంత అధునాతన మిలిటరీ ఈక్విప్ మెంట్ ను కొనుగోలు చేస్తుంది. వీటిలో అపాచీ ఎంహెచ్ 60 […]

Trump India Visit: ఇక రక్షణ రంగంలో భారత్-అమెరికా భాయీ.. భాయీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఉభయ దేశాల మధ్య కీలకమైన అయిదు ఒప్పందాలు కుదిరాయి. కొన్ని ప్రధాన అంశాల మీద రెండు దేశాల ప్రతినిధిబృందాలూ ఎం ఓ యుల పై సంతకాలు చేశాయి. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి 3 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదరడం విశేషం. ఈ అగ్రిమెంట్ కింద ఇండియా.. అమెరికా నుంచి అత్యంత అధునాతన మిలిటరీ ఈక్విప్ మెంట్ ను కొనుగోలు చేస్తుంది. వీటిలో అపాచీ ఎంహెచ్ 60 హెలికాఫ్టర్లు కూడా ఉంటాయి. వీటికి 2.6 డాలర్ల వ్యయమవుతుందని అంచనా.దీనివల్ల ఉభయ దేశాల రక్షణ సామర్థ్యం పెరుగుతుందని ట్రంప్, మోడీ పేర్కొన్నారు. హెల్త్ కు,  మెంటల్ హెల్త్ . మెడికల్ సాధనాల సేఫ్టీకి సంబంధించి అవగాహనా ఒప్పందాలు కుదిరినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ హౌస్ లో ట్రంప్, ప్రధాని మోడీ మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కుదిరిన ఒప్పందాల అనంతరం ఈ నేతలిద్దరూ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.

భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య విషయంలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని నిర్ణయించినట్టు ట్రంప్, మోడీ ప్రకటించారు. అంతర్జాతీయ టెర్రరిజంపై కలిసికట్టుగా పోరాడాలని కూడా నిర్ణయించామన్నారు. ఇక వాణిజ్య సంబంధాల విషయంలో ఉభయ దేశాల మధ్య కొన్ని అవరోధాలు ఉన్నాయని, అవి కూడా పరిష్కారమవుతాయని ఆశిస్తున్నామని ట్రంప్ అన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu