భారత బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కేసీఆర్, రైతులకు మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపు

|

Dec 06, 2020 | 11:03 AM

ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు టీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

భారత బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కేసీఆర్, రైతులకు మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపు
Follow us on

ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు టీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టీఆర్‌ఎస్ శ్రేణులు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటారని చెప్పారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటాన్ని చేస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టిఆర్ఎస్ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. భారత్ బంద్ విజయవంతం అవ్వడానికి టీఆర్‌ఎస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. బంద్‌ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read :

గ్రేటర్ ఎన్నికల్లో గెలిచినవారిలో 25 మందికి నేర చరిత్ర..వివరాలు విడుదల చేసిన ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌

ఏటా 10 రోజులు ‘నో స్కూల్‌ బ్యాగ్ డే’ అమలు చెయ్యండి, రాష్ట్రాల విద్యాశాఖల కార్యదర్శులకు కేంద్రం లేఖ

కరోనా అప్‌డేట్ : తెలంగాణలో కొత్తగా 622 పాజిటివ్ కేసులు, రికవరీ రేటు ఎంతంటే..?