ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి కరోనా

|

Jul 22, 2020 | 10:23 PM

తెలంగాణలో కరోనా బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులకు కరోనా సోకడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారినపడినట్లు వైద్యులు తెలిపారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి కరోనా
Follow us on

తెలంగాణలో కరోనా బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులకు కరోనా సోకడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారినపడినట్లు వైద్యులు తెలిపారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన అపోలో​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యేకు సన్నిహితంగా మెలిగిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇటీవల ఆయన నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో ప్రభుత్వ అధికారులు, పార్టీ శ్రేణుల్లో గుబులుపుడుతోంది. అయితే, ఇప్పటికే కొందరు నాయకులు హోం క్వారంటైన్ లోకి వెళ్లినట్లు సమాచారం.