బండి సంజయ్‌కు హరీశ్ రావు లెటర్ ఛాలెంజ్

|

Nov 01, 2020 | 11:43 AM

ఎన్నికల్లో పోటీచేసే హక్కు ప్రతిఒక్కరికి ఉంటుందని, అయితే, మీరు(బీజేపీ) ఏ నైతికతతో ఓట్లు అడుగుతున్నారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ బహిష్కృత నేత తోట కమలాకర్ రెడ్డి ఇవాళ మంత్రి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేశారు. ఈ సందర్భంగా మంత్రి సిద్దిపేటలో మాట్లాడుతూ.. తెలంగాణ పౌరుడిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కి బహిరంగలేఖ రాస్తున్నానని.. […]

బండి సంజయ్‌కు హరీశ్ రావు లెటర్ ఛాలెంజ్
Follow us on

ఎన్నికల్లో పోటీచేసే హక్కు ప్రతిఒక్కరికి ఉంటుందని, అయితే, మీరు(బీజేపీ) ఏ నైతికతతో ఓట్లు అడుగుతున్నారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ బహిష్కృత నేత తోట కమలాకర్ రెడ్డి ఇవాళ మంత్రి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేశారు. ఈ సందర్భంగా మంత్రి సిద్దిపేటలో మాట్లాడుతూ.. తెలంగాణ పౌరుడిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కి బహిరంగలేఖ రాస్తున్నానని.. దానికి ఆయన స్పందిస్తారని ఆశిస్తున్నాని అన్నారు. పింఛన్లపై సవాల్ చేస్తే ఇంతవరకు స్పందించలేదని విమర్శించారు. బీజేపీ నేతలు వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 అంశాలతో చార్జిషీట్ వేస్తే ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించారని విమర్శించారు. లోయర్ సీలేరు విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏపీకి అప్పగించింది, కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీని రద్దు చేసింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. బయ్యారంలో ఉక్కుపరిశ్రమ పెట్టకుండా కేంద్రం మోసం చేస్తున్నదని, నీటి పంపకాలు చేయకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.