Director Trivikram: పవన్ కోసం రంగంలోకి త్రివిక్రమ్.. ఆ సినిమాకు మాట సాయం చేయనున్న డైరెక్టర్..

|

Jan 16, 2021 | 1:17 PM

వకీల్ సాబ్ మూవీ తర్వాత పవన్ నటిస్తున్న చిత్రం అయ్యప్పనుమ్ కొషియం రీమేక్. ఇందులో టాలీవుడ్ హీరో రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

Director Trivikram: పవన్ కోసం రంగంలోకి త్రివిక్రమ్.. ఆ సినిమాకు మాట సాయం చేయనున్న డైరెక్టర్..
Follow us on

వకీల్ సాబ్ మూవీ తర్వాత పవన్ నటిస్తున్న చిత్రం అయ్యప్పనుమ్ కొషియం రీమేక్. ఇందులో టాలీవుడ్ హీరో రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కొషియం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు డైరెక్టర్ సాగర్ కె.చంద్ర. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను రూపొందిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.

పవన్, రానా కలిసి నటించనున్న ఈ మూవీకి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైలాగులు రాయనున్నారట. ఈ విషయాన్ని శుక్రవారం చిత్రయూనిట్ అధికారింగా ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. గతంలో పవన్ నటించిన తీన్మార్ సినిమాకు కూడా త్రివిక్రమ్ డైలాగులు రాశారు. మళ్లీ అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు త్రివిక్రమ్ డైలాగులు రాస్తుండడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం పవన్.. క్రిష్ డైరెక్షన్‎లో ఓ సినిమా చేస్తున్నాడు.

Also Read: ఎన్టీఆర్‌ సరసన కీర్తి సురేష్‌.. క్రేజీ పెయిర్‌ని సెట్‌ చేస్తోన్న మాటల మాంత్రికుడు..!

వరుడు కావలెను అంటోన్న రీతు వర్మ, నాగశౌర్య ఆమెకు సరితూగుతాడా..ఈ వీడియో చూసి చెప్పండి