గిరిజనులకు చంద్రబాబు చేసిందేమిటి? : మంత్రి పుష్పా శ్రీవాణి

|

Jun 20, 2019 | 3:20 PM

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై డిప్యూటీ సీఎం,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  పుష్పా శ్రీవాణి విమర్శలు చేసారు. గత ప్రభుత్వ హయాంలో గిరిజనులను అంటరానివారిగా చూశారని ఆరోపించారు.  మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె గిరిజన గ్రామాల ఆరోగ్య కార్యకర్తల వేతనాన్ని రూ.4 వేలకు పెంచుతూ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  గత ప్రభుత్వంలో గిరిజనులకు ఎలాంటి పదవులు దక్కలేదని, తమ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. గిరిజన ఆడ పిల్లలకు వైఎస్సార్ […]

గిరిజనులకు  చంద్రబాబు చేసిందేమిటి? : మంత్రి పుష్పా శ్రీవాణి
Follow us on

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై డిప్యూటీ సీఎం,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  పుష్పా శ్రీవాణి విమర్శలు చేసారు. గత ప్రభుత్వ హయాంలో గిరిజనులను అంటరానివారిగా చూశారని ఆరోపించారు.  మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె గిరిజన గ్రామాల ఆరోగ్య కార్యకర్తల వేతనాన్ని రూ.4 వేలకు పెంచుతూ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  గత ప్రభుత్వంలో గిరిజనులకు ఎలాంటి పదవులు దక్కలేదని, తమ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. గిరిజన ఆడ పిల్లలకు వైఎస్సార్ పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు అందజేస్తామని, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని గిరిజన ప్రాంతాల్లో ప్రథమ స్ధానంలో వచ్చేలా చేస్తామన్నారు మంత్రి శ్రీవాణి.