కేబుల్ ఆపరేటర్లకు ట్రాయ్ వార్నింగ్
న్యూఢిల్లీ: ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త నియమ, నిబంధనలను పాటించని కేబుల్ టీవీ, డీటీహెచ్ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) హెచ్చరించింది. చందాదారులు, కేబుల్ నిర్వాహకుల వ్యవస్థలను త్వరలోనే ఆడిట్ చేయనున్నట్లు తెలిపింది. ‘వినియోగదారుడి ఇష్టాయిష్టాలే అంతిమం. అందులో ఎలాంటి పునరాలోచన, రాజీపడేది లేదు. నిబంధనలను అనుసరించని కంపెనీలు అందుకు తగిన పర్యవసానాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది’ అని ట్రాయ్ ఛైర్మన్ ఆర్.ఎస్.శర్మ హెచ్చరించారు. ‘వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు మాకు ఫిర్యాదులు […]
న్యూఢిల్లీ: ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త నియమ, నిబంధనలను పాటించని కేబుల్ టీవీ, డీటీహెచ్ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) హెచ్చరించింది. చందాదారులు, కేబుల్ నిర్వాహకుల వ్యవస్థలను త్వరలోనే ఆడిట్ చేయనున్నట్లు తెలిపింది. ‘వినియోగదారుడి ఇష్టాయిష్టాలే అంతిమం. అందులో ఎలాంటి పునరాలోచన, రాజీపడేది లేదు. నిబంధనలను అనుసరించని కంపెనీలు అందుకు తగిన పర్యవసానాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది’ అని ట్రాయ్ ఛైర్మన్ ఆర్.ఎస్.శర్మ హెచ్చరించారు. ‘వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిలో కొన్ని సాఫ్ట్‌వేర్ సమస్యలు కాగా, పలువురు పంపిణీదారులు వినియోగదారుల ఎంపిక ప్రకారం ఛానళ్లను ప్రసారం చేయడం లేదు’ అని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపారు.