హుస్సేన్‌సాగర్‌లో కొబ్బరినీళ్లెక్కడ? టీఆర్ఎస్ హామీల పట్ల హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఉత్తమ్‌

|

Nov 24, 2020 | 2:00 PM

టీఆర్ఎస్ పార్టీ హామీల పట్ల హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సూచించారు. గతంలో కేసీఆర్ హుస్సేన్‌ సాగర్‌ నీటిని కొబ్బరినీళ్లలా

హుస్సేన్‌సాగర్‌లో కొబ్బరినీళ్లెక్కడ? టీఆర్ఎస్ హామీల పట్ల హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఉత్తమ్‌
Follow us on

టీఆర్ఎస్ పార్టీ హామీల పట్ల హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సూచించారు. గతంలో కేసీఆర్ హుస్సేన్‌ సాగర్‌ నీటిని కొబ్బరినీళ్లలా మారుస్తామని చెప్పారు.. ఏమైందని ఆయన ప్రశ్నించారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ఆకాశహర్మ్యాలు కడతామని చెప్పిన కేసీఆర్ ఇప్పటివరకు ఎందుకు నిర్మించలేదో చెప్పాలని  ఇవాళ గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోొ రిలీజ్ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేశారు .  సెలూన్లకు ఉచిత విద్యుత్‌ హామీని గతంలో ఎన్నోసార్లు చెప్పారని.. ఇలా చెప్పినవే మళ్లీ మళ్లీ చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.

హైదరాబాద్‌లో ఉచిత వై-ఫై సేవలు అందిస్తామని చెప్పారని.. అయితే ఇప్పటివరకు అములు చేయలేదని ఉత్తమ్ మండిపడ్డారు. నగరంలో లక్ష రెండు పడక గదుల ఇళ్లు కట్టిస్తామన్నారు.. ఇప్పటివరకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. నాలాల ఆధునికీకరణ గురించి గతంలో అనేకసార్లు చెప్పారు. ఏం చేయలేకపోయారన్నారు. హైదరాబాద్‌కు మెట్రో రైల్‌ తీసుకొచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అనిన ఉత్తమ్. . పాతబస్తీ వరకు మెట్రోను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు తీసుకెళ్లలేకపోయిందని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్‌ తాయిలాల వల వేయడం, తర్వాత మర్చిపోవడం మామూలే అంటూ టీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఇచ్చిన హామీలను కొట్టిపారేశారు.