భాగ్యనగర వాసులకు బ్రేకింగ్ న్యూస్.!

|

Oct 06, 2020 | 5:45 PM

భాగ్యనగర వాసులకు బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ సిగలోకి మరో పర్యాటక ఫీట్ వచ్చిచేరింది. హైటెక్ సిటీ ప్రాంతంలోని దుర్గం చెరువులో బోటింగ్ ను తెలంగాణ సర్కారు ఇవాళ అధికారికంగా ప్రారంభించింది. ఈ తెలంగాణ టూరిజం బోట్స్ ను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ప్రారంభించారు. వీటిలో ఒక రెస్టారెంట్ బోట్, ఒక ఫ్లాట్ బోట్, ఒక స్పీడ్ బోట్, రెండు ఫెడరల్ బోట్స్ ఉన్నాయి. ఇవి […]

భాగ్యనగర వాసులకు  బ్రేకింగ్ న్యూస్.!
Follow us on

భాగ్యనగర వాసులకు బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ సిగలోకి మరో పర్యాటక ఫీట్ వచ్చిచేరింది. హైటెక్ సిటీ ప్రాంతంలోని దుర్గం చెరువులో బోటింగ్ ను తెలంగాణ సర్కారు ఇవాళ అధికారికంగా ప్రారంభించింది. ఈ తెలంగాణ టూరిజం బోట్స్ ను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ప్రారంభించారు. వీటిలో ఒక రెస్టారెంట్ బోట్, ఒక ఫ్లాట్ బోట్, ఒక స్పీడ్ బోట్, రెండు ఫెడరల్ బోట్స్ ఉన్నాయి. ఇవి ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు పర్యాటకులకు అందుబాటులో ఉండనున్నాయి. ఇటీవలే మంత్రి కేటీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దుర్గం చెరువుపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తీగల వంతెనను ప్రారంభించి హైదరాబాదీలకు అంకితం చేసిన సంగతి తెలిసిందే.