ఆ కుటుంబాన్నే మింగేసిన మహమ్మారి..!

చైనాలో పుట్టిన మహమ్మారి ప్రపంచాన్నే కుదేపేస్తోంది. అప్పటి వరకు బాగాఉన్న వారు సైతం మాయదారి రోగం బారినపడుతున్నారు. వైరస్ ధాటికి కుటుంబాలకు కుటుంబాలే బలవుతున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలో ఇలాంటి విషాద ఘటన ఒకటి చోటుచేసుకుంది.

ఆ కుటుంబాన్నే మింగేసిన మహమ్మారి..!

Updated on: Jul 23, 2020 | 8:16 PM

చైనాలో పుట్టిన మహమ్మారి ప్రపంచాన్నే కుదేపేస్తోంది. అప్పటి వరకు బాగాఉన్న వారు సైతం మాయదారి రోగం బారినపడుతున్నారు. వైరస్ ధాటికి కుటుంబాలకు కుటుంబాలే బలవుతున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలో ఇలాంటి విషాద ఘటన ఒకటి చోటుచేసుకుంది. రాంచీ లోని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అశువులుబాసారు. రాంచీ పట్టణానికి చెందిన ఓ ఫ్యామిలిలో 89 ఏండ్ల తల్లికి మొదట కరోనా సోకింది. ఆమె ద్వారా ప్రైమరీ కాంటాక్ట్ తో మిగతా కుటుంబసభ్యులకు అంటుకుంది. దీంతో వారంతా 14 రోజుల వ్యవధిలోనే బలయ్యారు. అయితే, ఇతర నగరాల్లో వేర్వేరుగా నివాసం ఉంటున్న ఓ కొడుకు, ఓ కూతురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఒకే ఇంటిలో ఐదు మంది కరోనా కాటుకు బలి కావడంతో ఆ ఇల్లు స్మశానంగా మారిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్రంగా కలచివేసింది.