ఉపగ్రహాలను, రాకెట్లను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపడమే గాక,, ఇటీవలి చంద్రయాన్-2 మిషన్ తో మరింతగా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన ‘ ఇస్రో ‘ లో..వాద్య సంగీతంతో జనాలను ఆకట్టుకోగలిగే అద్భుతమైన ఓ ఆర్టిస్టు కూడా ఉన్నారు. బెంగుళూరులోని యు.ఆర్. రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ అయిన పి. కున్హికృష్ణన్ మంచి వేణుగాన విద్వాంసుడు కూడా.. సోమవారం బెంగుళూరులో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం ముగిశాక.. ఆయన తన వేణువుతో ‘ వాతాపి గణపతిమ్ భజే ‘ అనే కీర్తనను వాయించి అందరి ప్రశంసలు పొందారు.
ఈ కమిటీ సభ్యుడైన రాజ్యసభ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్.. తన ట్విటర్లో.. కున్హికృష్ణన్ వేణుగానానికి పరవశించి ఆ స్నిపెట్ ని పోస్ట్ చేశారు. ఈ ప్రొఫెషనల్ ఫ్లూట్ ప్లేయర్, కమ్ సైంటిస్టుని అభినందించారు. ఈ సమావేశంలో ఇస్రో చైర్మన్ కె. శివన్ కూడా పాల్గొన్నారు. ఒక పొలిటికల్ ‘ ఈవెంట్ ‘ లో ఓ ‘ మ్యూజికల్ పర్ఫామెన్స్ ‘ చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి..
The Parliamentary Standing Committee ended it’s last meeting at ISRO with a flute performance by the Director of its Satellite Centre in Bengaluru, P. Kunhikrishnan, who is also a professional flute player! He played the evergreen Vatapi Ganapatim Bhaje. Sharing a snippet. pic.twitter.com/AkwwPh9oZY
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 29, 2019