టాలీవుడ్‌ని విషాదాలు వీడటం లేదు. ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ మృతి మరచిపోకముందే ఇటీవలే నటుడు ఆలీ తల్లీ గారు, హీరో శ్రీకాంత్ తండ్రి దూరమయ్యి..వారి కుటుంబాల్లో దు:ఖాన్ని మిగిల్చారు. తాజాగా రెండు రోజుల క్రితమే సీనియర్ నటుడు జనార్ధన రావు కాలం చేశారు. ప్రస్తుత టాలీవుడ్ వర్గాలకు మరో చేదు వార్త అందింది. సీనియర్ నిర్మాత, శ్రీ విజయలక్ష్మి ప్రొడక్షన్స్, గీతా చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్స్‌లో నిర్మాణ భాగస్వామి సి. వెంకట్ రాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతోన్న ఆయన మార్చి 8న మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ విషయాన్ని పీఆర్‌ఓ బీఏ రాజు కన్ఫామ్ చేశారు. సోమవారం వెంకట్ రాజు అంత్యక్రియలు చెన్నైలో జరుగునున్నాయి.
మరో నిర్మాత బి. శివరాజుతో కలిసి వెంకట్ రాజు పలువురు అగ్ర కథానాయుకులతో సినిమాలు నిర్మించారు. ముఖ్యంగా విక్టరీ వెంకటేశ్‌తో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. ‘2 టౌన్ రౌడీ’, ‘పవిత్ర బంధం’, ‘పెళ్లిచేసుకుందాం’, ‘ఘర్షణ’ వంటి సూపర్ హిట్ మూవీస్‌ను వెంకట్ రాజు నిర్మించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన ‘చక్రం’ వంటి మంచి సినిమాకు కూడా ఆయన నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. వెంకట్ రాజు మరణ వార్త విని.. టాలీవుడ్ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Deeply regret to inform that Producer Sri C. Venkat Raju (Movies Produced: Pavithrabandam, Pellicheskundam, 2 Town Rowdy, Gharshana, Chakram etc) passed away today (08-03-2020) at Chennai due to ill health. Cremation will be held tomorrow (09-03-2020) at Chennai. #RIP
— BARaju (@baraju_SuperHit) March 8, 2020