ఏపీ వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబును సినీ నటుడు చిరంజీవి పరామర్శించారు. మంత్రి సోదరుడు సురేశ్‌బాబు గుండెపోటుతో బుధవారం రాత్రి అకాల మరణం చెందారు. ఈ వార్త తెలియగానే చిరంజీవి శుక్రవారం కాకినాడకు వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
ప్రజారాజ్యం పార్టీ స్ధాపించిన సమయంలో చిరంజీవికి రాజకీయ సలహాదారుడిగా కన్నబాబు సేవలందించారు. అలాగే ప్రజారాజ్యం పార్టీ తరపున కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. దీంతో వీరిద్దరిమధ్య సాన్నిహిత్యం ఉండటంతో చిరంజీవి ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.
మరోవైపు శుక్రవారం ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టాల్సి ఉండగా సోదరుని మృతి కారణంగా ఆయన అసెంబ్లీకి హాజరుకాలేదు. కన్నబాబు తరపున మరో మంత్రి బొత్స సత్యనారాయణ బడ్జెట్‌ను చదివి వినిపించారు.