Tokyo Olympics 2021: ఒలింపిక్స్‌లో పతకం.. దేశవ్యాప్తంగా సంబరాలు.. మీరు దేశానికి గర్వకారణం, యూత్‌కి ఆదర్శం అంటున్న ప్రధాని

|

Aug 05, 2021 | 11:44 AM

Tokyo Olympics 2021: 41 ఏళ్ల నిరీక్షణకు తెర దింపుతూ.. టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. జర్మనీపై 5-4 గోల్స్ తేడాతో గెలిచింది. కాంస్య పతకం సొంతం చేసుకుంది. సుదీర్ఘ కాలం తర్వాత..

Tokyo Olympics 2021: ఒలింపిక్స్‌లో పతకం.. దేశవ్యాప్తంగా సంబరాలు.. మీరు దేశానికి గర్వకారణం, యూత్‌కి ఆదర్శం అంటున్న ప్రధాని
Tokyo Olympics 2020
Follow us on

Tokyo Olympics 2021: 41 ఏళ్ల నిరీక్షణకు తెర దింపుతూ.. టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. జర్మనీపై 5-4 గోల్స్ తేడాతో గెలిచింది. కాంస్య పతకం సొంతం చేసుకుంది. సుదీర్ఘ కాలం తర్వాత ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ టీమ్ సత్తా చాటి పతకం గెలవడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. అసాధారణ ఆటతో అద్భుత విజయం సాధించి.. టోక్యోలో భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన భారత పురుషుల హాకీ జట్టు పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. చరిత్ర సృష్టించిన మన్‌ప్రీత్ సేనపై ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.మన హాకీ టీమ్ ను చూసి యావత్ భరతం గర్విస్తుందని ప్రధాని మోడీ ట్విట్ చేశారు

ఇక మరోవైపు ఒలింపిక్స్‌లో సత్తా చాటిన భారత హాకీ క్రీడాకారుల కుటుంబాల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. క్రీడాకారుల స్వగ్రామాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు స్థానికులతో కలిసి పాట, పాటలతో అదరగొడుతున్నారు.

భారత హాకీ టీమ్‌లో మణిపూర్ ప్లేయర్ నీలకంఠ శర్మ ఉన్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఇంపాల్ డ్యాన్స్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌లో హాకీ జట్టు ఘన విజయం సాధించడంలో తమ కుటుంబ సభ్యుడు ఉండటం ఎంతో సంతోషకరమన్నారు. తమకు ఎంతో గర్వంగా ఉందని గ్రామస్థులు చెప్పారు.

Read Also : Weight Loss Tips: ఈ జ్యూస్‌లను తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం.. తక్కువ రోజుల్లోనే సహజ పద్దతిలో బరువు అదుపు