‘కల్లు తాగితే కరోనా పరార్.. ప్రజలు కల్లు ఎక్కువగా తాగాలి’.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో తెలుసా?

|

Dec 23, 2020 | 7:32 PM

కరోనాను అంతమొందించడానికి ఓవైపు ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలంతా పరిశోధనల్లో తలమునకలవుతుంటే సింపుల్‌గా కల్లు తాగితే చాలని సెలవిసున్నారు బహుజన సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ బిభాగం అధ్యక్షుడు భీమ్ రాజ్‌భర్.

‘కల్లు తాగితే కరోనా పరార్.. ప్రజలు కల్లు ఎక్కువగా తాగాలి’.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో తెలుసా?
Follow us on

Toddy prevents Covid: కొన్నిసార్లు కొంత మంది రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలు విపరీతంగా నవ్వు తెప్పిస్తుంటాయి. అసలు వారు అవగాహన ఉండి ఆ వ్యాఖ్యలు చేస్తుంటారా? లేదా పొరపాటున అలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అర్థం కాదు. సమాజంలో ప్రజలను ప్రభావితం చేసే స్థానంలో ఉన్నామని తెలిసి కూడా బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకనేగా మీ సందేహం. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
కరోనాను అంతమొందించడానికి ఓవైపు ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలంతా పరిశోధనల్లో తలమునకలవుతుంటే సింపుల్‌గా కల్లు తాగితే చాలని సెలవిసున్నారు బహుజన సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ బిభాగం అధ్యక్షుడు భీమ్ రాజ్‌భర్. కల్లు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, కల్లు చుక్క గంగానది నీటి కంటే స్వచ్చమైందని వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కల్లు ఎక్కువగా తాగాలని అలా చేస్తే కరోనా దరి చేరదని తెలిపారు. ప్రతి రోజూ కల్లు తాగే వారికి కరోనా రాదన్నారు.  అంతటితో ఆగకుండా రాజ్‌భర్ సమాజంలో చిన్నతనం నుంచే పిల్లలకు కల్లు తాగిస్తారని చెప్పుకొచ్చారు. దీంతో భీమ్ రాజ్‌భర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్‌గా మారాయి.