Today Silver Rates in Hyderabad: వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.1,700 పెరుగుదల..

|

Dec 18, 2020 | 10:51 AM

బంగారం ధరలతో వెండి పోటి పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుండటంతో సిల్వర్ ధరలు క్రమంగా పంజుకుంటున్నాయి. గత నెలలో..

Today Silver Rates in Hyderabad: వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.1,700 పెరుగుదల..
Follow us on

బంగారం ధరలతో వెండి పోటీ పడుతోంది. కొద్ది రోజుల క్రితం ధరలు తగ్గినా.. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుండటంతో సిల్వర్ రేట్స్ క్రమంగా పంజుకుంటున్నాయి. గత నెలలో నేల చూపు చూసిన వెండి ధర ఇప్పుడు ఆకాశం వైపు పరుగెడుతోంది. ఆ ప్రభావం మనదేశంపైనా పడింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో వరుసుగా మూడో రోజు కూడా వెండి ధరలు భారీగా పెరిగాయి. తాజాగా రూ.1,400 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ. 67,000 లకు రీచ్ అయ్యింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆ ధర రూ.70 వేల మార్క్‌ను చేరింది. తెలుగు రాష్ట్రాల్లో నేడు కేజీ వెండిపై రూ.1700 పెరిగింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కేజీ వెండి ధర రూ.70,600 వద్ద కొనసాగుతుంది.

 

Also read:

Today Gold Rates: గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. ఈసారి ఎంత పెరిగిందంటే…

Andhra Pradesh : అల్ప ఖనిజాల తవ్వకాలకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు..మైనర్ మినరల్ నిబంధనలకు పలు సవరణలు