గత మూడు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఈరోజు పెట్రోల్ ధర 22 పైసలు, డీజిల్ ధర 26 పైసల చొప్పున క్షీణించాయి. దీంతో ఇవాళ లీటర్ పెట్రోల్ ధర రూ.77.55లు కాగా, లీటర్ డీజిల్ ధర రూ.71.89లుగా ఉంది. ఈ ఏడాది మొదలు నుంచీ.. పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా.. రెండు, మూడు రోజుల నుంచి అంతర్జాతీయంగా ముడిచమురుల ధరలపై ప్రభావం నెలకొనడంతో.. ధరలు తగ్గుముఖం పడుతున్నాయని.. మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీతో పాటు, ఏపీ వ్యాప్తంగా కూడా ముడిచమురు ధరలు తగ్గాయి. తాజాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధర రూ.77.26 కాగా డీజిల్ ధర రూ. 71.53 పైసలుగా ఉంది. అలాగే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 72.68లు కాగా, డీజిల్ రూ.65.68గా ఉంది. కాగా.. అంతర్జాతీయ మార్కెట్లో ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూంటాయి. దీని కారణంగా.. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతీ రోజూ మారుతూంటాయి.