తెలంగాణ: ఎంసెట్‌ కేంద్రం మార్పునకు నేడే ఆఖరు

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది.ఈ మహమ్మారి కారణంగా జరగాల్సిన పరీక్షలు రద్దయ్యాయి, కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఎంసెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న

తెలంగాణ: ఎంసెట్‌ కేంద్రం మార్పునకు నేడే ఆఖరు

Edited By:

Updated on: Jun 26, 2020 | 8:15 AM

Last day to change EAMCET center: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది.ఈ మహమ్మారి కారణంగా జరగాల్సిన పరీక్షలు రద్దయ్యాయి, కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఎంసెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణలో పరీక్ష కేంద్రాన్ని మార్చుకునే వెసులుబాటును కల్పించారు. ఇప్పటికే దరఖాస్తులు చేసినవారిలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పరీక్ష కేంద్రాన్ని మార్చుకోవాలనుకునేవారికి శుక్రవారం వరకే గడువు ఉందని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎంసెట్‌ కన్వీనర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం క్రమంలో అభ్యర్థులు తమకు సమీపంలో ఉన్న సెంటర్లను ఎంచుకునేందుకు ఈ అవకాశం కల్పించారు.

Also Read: జూలై 21 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర.. 15 రోజులకు కుదింపు..