Today Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌ న్యూస్‌… తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన బంగారం ధరలు…

|

Jan 17, 2021 | 5:50 AM

Today Gold Price: బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పులు కనిపిస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో విపరీతంగా పెరిగిపోయిన బంగారం ధరలు ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పడుతూ వచ్చాయి. అయితే..

Today Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌ న్యూస్‌... తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన బంగారం ధరలు...
Follow us on

Today Gold Price: బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పులు కనిపిస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో విపరీతంగా పెరిగిపోయిన బంగారం ధరలు ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పడుతూ వచ్చాయి. అయితే శనివారం స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఆదివారం మళ్లీ తగ్గుముఖం పట్టాయి. మరి ఆదివారం దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో తులం బంగారం ఎంత పలుకుతోందో చూద్దాం..

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 48,140 పలకగా.. 24 క్యారెట్లు రూ.52,510 గా ఉంది. ఇక ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,910 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,910గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,500 ఉండగా.. (శనివారంతో పోలీస్తే రూ.500 తగ్గింది). 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,640 గా నమోదైంది (శనివారంతో పోల్చితే సుమారు రూ.540 తగ్గింది). ఇక విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 45,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,640గా ఉంది. విశాఖపట్నంలోనూ బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 45,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌.. రూ.49,640గా పలికింది.

Also Read: Today Silver Price: బంగారం బాటలోనే వెండి.. పతనమైన ధరలు.. ఈరోజు సిల్వర్‌ ధరలు ఎలా ఉన్నాయంటే…