Today Silver Price: బంగారం బాటలోనే వెండి.. పతనమైన ధరలు.. ఈరోజు సిల్వర్‌ ధరలు ఎలా ఉన్నాయంటే…

Today Silver Price: ఆదివారం బంగారు ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. శనివారం వెండి ధరతో పోలీస్తే దేశ రాజధానిలో కిలో వెండిపై ఏకంగా రూ. 1600 తగ్గడం విశేషం...

Today Silver Price: బంగారం బాటలోనే వెండి.. పతనమైన ధరలు.. ఈరోజు సిల్వర్‌ ధరలు ఎలా ఉన్నాయంటే...
Follow us

|

Updated on: Jan 17, 2021 | 5:49 AM

Today Silver Price: ఆదివారం బంగారు ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. శనివారం వెండి ధరతో పోలీస్తే దేశ రాజధానిలో కిలో వెండిపై ఏకంగా రూ. 1600 తగ్గడం విశేషం. తాజాగా తగ్గిన ధరల ప్రకారం ఢిల్లీ నంచి హైదరాబాద్‌ వరకు కిలో వెండి ధర ఎంత పలుకుతుందో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం కిలో వెండి ధర రూ. 1600 తగ్గి.. రూ. 65,000గా కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ రూ. 1600 తగ్గి.. కిలో వెండి రూ. 65,000 వద్ద కొనసాగుతోంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో శనివారంతో పోలీస్తే.. కిలో వెండిపై రూ. 900 వరకు ధర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో బంగారం రూ. 69,700గా ఉంది. విజయవాడలోనూ కిలో వెండి రూ. 69,700గానే ఉంది. ఇక విశాఖపట్నం విషయానికొస్తే.. ఇక్కడ కూడా ఇదే ధర కొనసాగుతోంది.

Also Read: Today Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌ న్యూస్‌… తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన బంగారం ధరలు…