త్వరలో చెన్నై-తిరుపతి మధ్య ప్రైవేట్ రైలు..!

|

Sep 20, 2020 | 2:56 PM

దేశవ్యాప్తంగా కోట్లాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న భారతీయ రైల్వేలో ప్రైవేట్ రైళ్లను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా దేశంలో మొట్టమొదటి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ పట్టాలపై పరుగులు తీస్తోంది.

త్వరలో చెన్నై-తిరుపతి మధ్య ప్రైవేట్ రైలు..!
Follow us on

దేశవ్యాప్తంగా కోట్లాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న భారతీయ రైల్వేలో ప్రైవేట్ రైళ్లను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా దేశంలో మొట్టమొదటి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ పట్టాలపై పరుగులు తీస్తోంది. త్వరలో చెన్నై సెంట్రల్‌-తిరుపతి, ఎర్నాకుళం-కొచ్చివెల్లి మార్గాల్లో రెండు ప్రైవేటు రైలు సర్వీసులను నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. చెన్నై-తిరుపతి మధ్య నడిచే ప్రైవేటు రైలు వారానికి ఒకరోజు మాత్రమే నడువనుండగా, ఎర్నాకుళం- కొచ్చివెల్లి ప్రత్యేక రైలు వారానికి మూడురోజులు నడువనుంది. చెన్నై-తిరుపతి ప్రైవేటు రైలు శనివారం ఉదయం 7.20 గంటలకు చెన్నై సెంట్రల్‌ నుంచి బయల్దేరి 10.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే, తిరుపతిలో ఆదివారం ఉదయం 9.40 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12.50 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది. ఈ రైలు అరక్కోణం, రేణిగుంట స్టేషన్‌లలో మాత్రమే ఆగుతుంది. రైళ్ల సమయాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని దక్షిణ రైల్వే తెలియజేసింది. అయితే, ఈ ప్రైవేటు రైలులో ప్రయాణించాలంటే కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని దక్షిణ రైల్వే పేర్కొంది. రైల్వేస్టేషన్‌కు వచ్చే వాళ్లు, రైళ్లలో ప్రయాణించే సమయంలోనూ ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని అధికారు సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లఘించిన వారి నుంచి జరిమానా విధిస్తామని చేస్తామని దక్షణ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.