శ్రీవారి సర్వదర్శనం టిక్కెట్లకోటా పెంపు

|

Nov 06, 2020 | 10:57 AM

తిరుమల శ్రీవారిని దర్శించేందుకు వచ్చే భక్తుల కోసం సర్వదర్శనం టోకెన్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం పెంచింది. ప్రస్తుతం 3వేలు టోకెన్లను జారీ చేస్తుండగా నేటి నుంచి 7 వేల టోకెన్లు జారీ చెయ్యనుంది. సర్వదర్శనం టోకెన్లను మొన్న మంగళవారం నుంచి తాత్కాలికంగా నిలిపివేయడానికి టీటీడీ భావించింది. అయితే, శ్రీవారి దర్శనానికి అనూహ్యంగా పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో తన నిర్ణయాన్ని పున:సమీక్షించింది. కొవిడ్ వేళ ఇప్పటికే నాలుగు సార్లు సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసిన టీటీడీ.. ప్రస్తుతానికి […]

శ్రీవారి సర్వదర్శనం టిక్కెట్లకోటా పెంపు
Follow us on

తిరుమల శ్రీవారిని దర్శించేందుకు వచ్చే భక్తుల కోసం సర్వదర్శనం టోకెన్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం పెంచింది. ప్రస్తుతం 3వేలు టోకెన్లను జారీ చేస్తుండగా నేటి నుంచి 7 వేల టోకెన్లు జారీ చెయ్యనుంది. సర్వదర్శనం టోకెన్లను మొన్న మంగళవారం నుంచి తాత్కాలికంగా నిలిపివేయడానికి టీటీడీ భావించింది. అయితే, శ్రీవారి దర్శనానికి అనూహ్యంగా పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో తన నిర్ణయాన్ని పున:సమీక్షించింది. కొవిడ్ వేళ ఇప్పటికే నాలుగు సార్లు సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసిన టీటీడీ.. ప్రస్తుతానికి సర్వదర్శనం టోకెన్లు జారీని ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అంతే కాదు సర్వ దర్శనం టోకెన్ జారీ కేంద్రాలను పెంచాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టోకెన్లను జారీ చేస్తున్న భూదేవి కాంప్లెక్స్ తో పాటు విష్ణునివాసం, మహతి ఆడిటోరియం, గోవిందరాజ స్వామి సత్రాల దగ్గర సర్వదర్శనం టికెట్ల జారీ కేంద్రాలు తెరిచారు.