Tirumala News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల..

Tirumala News Today: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. కాసేపటి క్రితం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను.. భక్తుల సౌకర్యార్ధం..

Tirumala News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల..

Updated on: Dec 30, 2020 | 11:00 AM

Tirumala News Today: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. కాసేపటి క్రితం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను.. భక్తుల సౌకర్యార్ధం రోజుకు 20 వేల చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. జనవరి 4 నుంచి 31 వరకు టీటీడీ వెబ్‌సైట్ ద్వారా భక్తులకు టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రతీరోజూ ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు టైం స్లాట్‌లను ఇచ్చింది. అలాగే కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని భక్తులకు టీటీడీ మరోసారి సూచనలు ఇచ్చింది.

కాగా, జనవరిలో జరగనున్న విశేష ఉత్సవాల వివరాలను సైతం తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. జనవరి 7న అధ్యయనోత్సవాలు సమాప్తి, జనవరి 8న తిరుమలనంబి సన్నిధికి శ్రీ మలయప్ప స్వామి వారు వేంచేపు, జనవరి 9, 24వ తేదీల్లో సర్వ ఏకాదశి, జనవరి 10న శ్రీ తొండరడిప్పొడియాళ్వార్‌ వర్షతిరునక్షత్రం, జనవరి 13న భోగి, జనవరి 14న మకర సంక్రాంతి, జనవరి 15న కనుమ, శ్రీ గోదా పరిణయోత్సవం, శ్రీవారి పార్వేట ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది.

Also Read:

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు…

ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. 2021లో కొలువుల జాతర..!