Not Out But : ఆసీస్ కెప్టెన్​ టిమ్ ​పైన్​ నాటౌట్‌పై వివాదం…థర్డ్​ అంపైర్ నిర్ణయంను తప్పుబడుతున్న సీనియర్లు..

బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్​ టిమ్ ​పైన్​ నాటౌట్ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపైషేన్​ వార్న్​ సహ పలువురు మాజీలు తప్పుపడుతున్నారు. తొలిరోజు ఆటలో​ క్రీజులైన్​పై పైన్​ బ్యాట్​ పెట్టడం..

Not Out But : ఆసీస్ కెప్టెన్​ టిమ్ ​పైన్​ నాటౌట్‌పై వివాదం...థర్డ్​ అంపైర్ నిర్ణయంను తప్పుబడుతున్న సీనియర్లు..

Updated on: Dec 26, 2020 | 8:09 PM

Not Out But : బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్​ టిమ్ ​పైన్​ నాటౌట్ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపైషేన్​ వార్న్​ సహ పలువురు మాజీలు తప్పుపడుతున్నారు. తొలిరోజు ఆటలో​ క్రీజులైన్​పై పైన్​ బ్యాట్​ పెట్టడం.. టీమిండియా కీపర్ పంత్​ వికెట్లను గ్లౌజ్​తో తాకడం దాదాపు ఒకేసారి జరిగాయి. బ్యాట్​ క్రీజులైన్​ లోపల ఉందని భావించిన థర్డ్​ అంపైర్ పైన్​​ నాటౌట్​ అని ప్రకటించాడు.

అయితే థర్డ్​ అంపైర్ నిర్ణయంతో షాకయ్యానని ఆసీస్​ దిగ్గజ స్పిన్నర్ షేన్​ వార్న్ అభిప్రాయపడ్డారు. టిమ్​ పైన్​ను రనౌట్​గా ప్రకటించకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. తాను చాలా జాగ్రత్తగా  పరిశీలించానంటూ పేర్కొన్నారు. క్రీజ్​ లైన్​ను బ్యాట్​ దాటలేదనే అనుకుంటున్నా… తన ఉద్దేశంలో అతడు ఔట్ అయ్యాడని షేన్ వార్న్ స్పష్టం చేశాడు.


పైన్​ను ఔట్​ ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు భారత మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా. అది కచ్చితంగా ఔట్ అని అన్నారు. అంపైర్​ నిర్ణయం తర్వాత స్క్వేర్​ లెగ్​ అంపైర్​తో మాట్లాడాడు భారత సారథి రహానె.

అయితే ఆ రనౌట్​ నుంచి తప్పించుకున్నప్పటికీ, ఆ ఛాన్స్‌ను పైన్ ఎక్కవ సేపు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కొద్దిసేపటికే​ అశ్విన్ అతడిని పెవిలియన్​కు పంపించాడు. తొలి భారత బౌలర్లపై ప్రశంసలు కురుస్తున్నాయి.