టిక్ టాక్‌ స్టార్‌ను కాల్చి చంపారు

|

May 22, 2019 | 11:28 AM

సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. అయితే ఈ యాప్‌ను సమర్థించేవారితో పాటు విమర్శించేవారు కూడా ఉన్నారు. కానీ ఈ అప్లికేషన్ ద్వారా చాలామంది ఓవర్ నైట్ సెలబ్రిటీస్ అయిన మాట వాస్తవం. అలాంటి వ్యక్తుల్లో ఒకరు..ఢిల్లీలో జిమ్ ట్రైనరైన 27 ఏళ్ల మోహిత్ మోర్. తాజాగా కొందరు గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఈ సోషల్ మీడియా సెలబ్రిటీ చనిపోయాడు. ఔటర్ ఢిల్లీలో సాయంత్రం వేళ 6 గంటలకు […]

టిక్ టాక్‌ స్టార్‌ను కాల్చి చంపారు
Follow us on

సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. అయితే ఈ యాప్‌ను సమర్థించేవారితో పాటు విమర్శించేవారు కూడా ఉన్నారు. కానీ ఈ అప్లికేషన్ ద్వారా చాలామంది ఓవర్ నైట్ సెలబ్రిటీస్ అయిన మాట వాస్తవం. అలాంటి వ్యక్తుల్లో ఒకరు..ఢిల్లీలో జిమ్ ట్రైనరైన 27 ఏళ్ల మోహిత్ మోర్. తాజాగా కొందరు గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఈ సోషల్ మీడియా సెలబ్రిటీ చనిపోయాడు. ఔటర్ ఢిల్లీలో సాయంత్రం వేళ 6 గంటలకు ఓ ఫొటో కాపీ షాప్‌లో కూర్చున్న మోహిత్ మోర్‌పై దుండగులు ఏడుసార్లు కాల్పులు జరపగా… అతను స్పాట్‌లో ప్రాణాలు విడిచాడు.

మోహిత్ మోర్‌కి  టిక్ టాక్‌లో 5.17 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అతను హర్యానాలోని బహదూర్‌ఘర్ ప్రాంతానికి చెందినవాడు. ప్రస్తుతం ఢిల్లీలోని నజఫ్‌ఘర్‌లో ఉంటున్నాడు.  అక్కడి రెండు ముఠాల మధ్య ఇటీవల జరిగిన అల్లర్లకూ, మోహిత్ మోర్‌కూ ఏదైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కాగా హత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. కాల్పులు జరిగిన చోట సీసీ కెమెరా ఫుటే‌జ్‌ను సేకరించిన పోలీసులు మర్డర్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.