తీహార్ జైలులో సిబ్బంది దారుణం.. ముస్లిం ఖైదీ వీపుపై..

| Edited By:

Apr 20, 2019 | 1:41 PM

న్యూఢిల్లీ : దేశ రాజధాని తీహార్ జైలులో దారుణం చోటుచేసుకుంది. నబ్బీర్ అనే ఓ ముస్లిం ఖైదీ వీపుపై కొందరు జైలులోని సిబ్బంది ‘ఓం’ గుర్తును ముద్రించారు. ఇదంతా జైలు సూపరింటెండెంట్ సమక్షంలోనే జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. ‘మమ్మల్ని అవమానించడానికి రోజుకొక కొత్త మార్గాన్ని కనిపెడుతున్నారు. అతన్ని ఓ పశువులాగా భావించి ఓం గుర్తును ముద్రించారు. మేము మనుషులమే, వస్తువులం కాదు. […]

తీహార్ జైలులో సిబ్బంది దారుణం.. ముస్లిం ఖైదీ వీపుపై..
Follow us on

న్యూఢిల్లీ : దేశ రాజధాని తీహార్ జైలులో దారుణం చోటుచేసుకుంది. నబ్బీర్ అనే ఓ ముస్లిం ఖైదీ వీపుపై కొందరు జైలులోని సిబ్బంది ‘ఓం’ గుర్తును ముద్రించారు. ఇదంతా జైలు సూపరింటెండెంట్ సమక్షంలోనే జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. ‘మమ్మల్ని అవమానించడానికి రోజుకొక కొత్త మార్గాన్ని కనిపెడుతున్నారు. అతన్ని ఓ పశువులాగా భావించి ఓం గుర్తును ముద్రించారు. మేము మనుషులమే, వస్తువులం కాదు. కావాలనే నబ్బీర్‌ ఒంటి మీద ఈ ప్రత్యేక గుర్తును ముద్రించారు. అంతే తప్ప ఇందుకు మరే బలమైన కారణాలు లేవు’ అని ట్వీట్‌ చేశారు.

మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో నబ్బీర్ ను మరో జైలుకు తరలించిన డీజీపీ, ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి అధికారి నేతృత్వంలో విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను త్వరలోనే ఢిల్లీ హైకోర్టుకు సమర్పిస్తారని పేర్కొన్నారు.