గత 2 నెలల్లో దాదాపు 200 ఫ్లైట్స్ రద్దు కావడంతో విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. జనవరితో పోలిస్తే టికెట్ ధరలు బాగా పెరిగాయి. ముఖ్యంగా ఢిల్లీ-ముంబై వంటి ప్రధాన రూట్లలో ధరలు ఆకాశానంటుతున్నాయి.
ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిగో, జెట్ ఎయిర్‌వేస్ ఫిబ్రవరి నుంచి చూస్తే దాదాపు 200 ఫ్లైట్స్‌ను రద్దు చేశాయి. ముంబై ఎయిర్‌పోర్ట్ రన్‌వే మరమత్తులు, జెట్ ఎయిర్‌వేస్ ఆర్థిక ఇబ్బందులు, ఇండిగో పైలెట్ల సర్దుబాటు వంటి పలు అంశాలు ఇందుకు కారణం.
ఇటీవల ముంబై-ఢిల్లీ ఫ్లైట్ టికెట్ ధర ఏకంగా రూ.20,000 వరకు చేరింది. ఇతర రూట్లలోనూ ధరలు పెరిగాయి. అడ్వాన్స్ టికెట్లను బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు ధరల పెంపు ప్రభావం ఉండదు. అయితే చివరి నిమిషంలో టికెట్లను బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి.