70 రోజుల్లో 44మంది ఉగ్రవాదులను హతమార్చిన భారత ఆర్మీ

న్యూఢిల్లీ: ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 44 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు భారత సైన్యం వర్గాలు వెల్లడించాయి. హతమైన వారిలో ఎక్కువ మంది జైషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులే ఉన్నట్లు పేర్కొన్నాయి. గత నెల పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి పథకం రచించిన ప్రధాన సూత్రధారి కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలిపారు. ట్రాల్ లోని పింగ్లిష్‌ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్‌ ఉగ్రవాది ముదాసిర్‌ అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌ […]

70 రోజుల్లో 44మంది ఉగ్రవాదులను హతమార్చిన భారత ఆర్మీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:21 PM

న్యూఢిల్లీ: ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 44 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు భారత సైన్యం వర్గాలు వెల్లడించాయి. హతమైన వారిలో ఎక్కువ మంది జైషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులే ఉన్నట్లు పేర్కొన్నాయి. గత నెల పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి పథకం రచించిన ప్రధాన సూత్రధారి కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలిపారు. ట్రాల్ లోని పింగ్లిష్‌ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్‌ ఉగ్రవాది ముదాసిర్‌ అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌ హతమయ్యాడని అధికారులు తెలిపారు. జనవరి నుంచి మార్చి10వ తేదీ వరకు పాకిస్తాన్ 478 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ‘ఈ ఏడాదిలో మొదటి 70 రోజుల్లో మన ఆర్మీ జవాన్లు 44 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారని.. గతేడాదితో పోలిస్తే ఇది ఈ సారి ఎక్కువ అని తెలిపారు. కాగా 2018లో నియంత్రణ రేఖ వెంబడి 1629సార్లు పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ ఉల్లంఘించిందన్నారు. ఈ ఏడాది పుల్వామా దాడి తర్వాత 21 రోజుల్లో 18 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని.. ఇందులో 14 మంది జేషే సంస్థకు చెందిన ఉగ్రవాదులున్నారని వెల్లడించారు. ఏప్లస్‌ కేటగిరికి చెందిన 6మంది ఉగ్రవాదులను హతమార్చాం’ అని లెఫ్టినెంట్‌ జనరల్‌ కేజేఎస్‌ ధిల్లాన్‌ తెలిపారు.