విశాఖ : రేగుపాలెం వద్ద రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం

విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం సమీపంలోని నేషనల్ హైవేపై యాక్సిడెంట్ జరిగింది. ఎలమంచిలి నుంచి అడ్డరోడ్డు గ్రామానికి శుభకార్యంలో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై...

విశాఖ : రేగుపాలెం వద్ద రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం

Updated on: Oct 18, 2020 | 8:22 PM

విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం సమీపంలోని నేషనల్ హైవేపై యాక్సిడెంట్ జరిగింది. ఎలమంచిలి నుంచి అడ్డరోడ్డు గ్రామానికి శుభకార్యంలో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఎలమంచిలి మిల్ట్రీ కాలనీకి చెందిన సిద్ధ లీలాసంతోష్, సిద్ధ కాంతమ్మ, సుజాత, ఏడాదిన్నర వయసుగల కన్య శ్రీ అనే పాప ఎలమంచిలి నుంచి అడ్డరోడ్డుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. రేగుపాలెం చెక్ పోస్టు వద్ద వీరి వాహనానికి ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన లారీని ఆపిన డ్రైవర్…దిగి రోడ్డు క్రాస్ చేస్తుండగా బైక్ పై వెళ్తున్న వీరు ముందుగా అతని ఢీకొట్టారు. అక్కడ్నుంచి ఆగి ఉన్న లారీని ఢీ కొట్టగా… చిన్నారితో సహా సంతోష్, కాంతమ్మ స్పాట్‌లో  మృతి చెందారు.

ఈ ప్రమాదంలో సుజాత, లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా వారిని విశాఖ కేజీహెచ్​కు తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో ఎలమంచిలిలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Also Read :

కాలిఫోర్నియాలోని ఈ రాజభవనం అద్దె ఎంతో తెలుసా..!

Bigg Boss Telugu 4: బిగ్ బాస్‌పై భారీ ట్రోలింగ్ !

Loading...
Unable to load recommendations.
Follow Us