చైనాలో వేలాది ‘వైరస్ కేటుగాళ్ల’ అరెస్ట్, ప్రాసిక్యూషన్

| Edited By: Pardhasaradhi Peri

Aug 31, 2020 | 7:34 PM

కరోనా వైరస్ సంబంధ నేరాలు చైనాలో విపరీతంగా పెరిగాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ  వైరస్ తరుణంలో అకారణంగా హెల్త్ వర్కర్లను గాయపరచడం లేదా చంపడం, లోప భూయిష్టమైన వైద్య పరికరాలను..

చైనాలో వేలాది వైరస్ కేటుగాళ్ల అరెస్ట్, ప్రాసిక్యూషన్
Follow us on

కరోనా వైరస్ సంబంధ నేరాలు చైనాలో విపరీతంగా పెరిగాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ  వైరస్ తరుణంలో అకారణంగా హెల్త్ వర్కర్లను గాయపరచడం లేదా చంపడం, లోప భూయిష్టమైన వైద్య పరికరాలను అమాయకులకు, ఆస్పత్రులకు అమ్మడం, పాజిటివ్ సోకినా తమ  ట్రావెల్ హిస్టరీని కప్పిపుచ్చడం వంటి వివిధ నేరాలకు పాల్పడిన ‘కేటుగాళ్లు’ వేల సంఖ్యలో ఉండడం చూసి ప్రాసిక్యూషన్ కార్యాలయమే విస్మయం వ్యక్తం చేసింది. జనవరి నుంచి జులై నెలవరకు ఈ విధమైన ఆరోపణలతో దాదాపు 5,700 మందిని అరెస్టు చేయగా, 6,755 మందిని ప్రాసిక్యూట్ చేసినట్టు ఈ కార్యాలయ అధికారులు, లాయర్లు తెలిపారు. వీరిలో అనేక మందిని డిటెన్షన్ శిబిరాలకు తరలించినట్టు వారు చెప్పారు. కరోనా వైరస్ ని చైనా చాలావరకు అదుపులోకి తేగలిగింది. ఇందుకు ఇలాంటివారిపట్ల కఠిన చర్యలు తీసుకోవడం కూడా కారణమని తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా దేశంలో కొత్త ఇన్ఫెక్షన్ కేసులు లేవని బీజింగ్ లోని అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ ఆవిర్భావానికి కారణమని భావిస్తున్న వూహాన్ సిటీ నుంచి కూడా కరోనా వైరస్ కి సంబంధించిన సమాచారమేదీ లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కామ్ గా ఉంది.