బీహార్ లో ఎన్డీయే విజయం ప్రధాని మోదీదే అన్నారు లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ ! ఈ ఎలెక్షన్స్ లో బీజేపీ ఊహించినదానికన్నా మంచి మెరుగైన తీరును కనబరించిందన్నారు. మోదీ పై ప్రజల విశ్వాసం చెక్కుచెదరలేదనడానికి ఈ ఫలితాలే నిదర్శనం అని ఆయన వ్యాఖ్యనించారు. మేము బాగానే ఫైట్ చేసాం, ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగాం, అనేక జిల్లాల్లో మా పార్టీ పటిష్టంగా ఉందని వెల్లడైంది అని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇది తమ పార్టీకి చాలా ఉపయోగపడుతుందన్నారు. చిరాగ్ గారి పార్టీ ఈ ఎన్నికల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. అయినా ఆయన..తన ‘ఆత్మవిశ్వాసాన్ని’ ఇలా చాటుకున్నారు.