ఢిల్లీలో థర్డ్ వేవ్ కరోనా వైరస్, అయినా లాక్ డౌన్ విధించం, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్, మాస్క్ మస్ట్ !

| Edited By: Anil kumar poka

Nov 16, 2020 | 12:53 PM

ఢిల్లీలో థర్డ్ వేవ్ కరోనా వైరస్ మొదలైందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. అయితే మళ్ళీ లాక్ డౌన్ విధించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల పెద్దగా ప్రయోజనం లేదని భావిస్తున్నామని,

ఢిల్లీలో థర్డ్ వేవ్ కరోనా వైరస్, అయినా లాక్ డౌన్ విధించం, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్, మాస్క్ మస్ట్ !
Follow us on

ఢిల్లీలో థర్డ్ వేవ్ కరోనా వైరస్ మొదలైందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. అయితే మళ్ళీ లాక్ డౌన్ విధించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల పెద్దగా ప్రయోజనం లేదని భావిస్తున్నామని, ప్రతి వ్యక్తీ మాస్కులు ధరించడమే ఉత్త మమని ఆయన చెప్పారు. లాక్ డౌన్ విధించవచ్చునన్న ఊహాగానాలను ఆయన ఖండించారు.  మాస్కును నిర్బంధం చేస్తే మంచిదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అటు-గత 24 గంటల్లో నగరంలో కొత్తగా 3,235 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 95 మంది కరోనా రోగులు మృతి చెందారు. హస్తినలో ఈ కేసులు పెరిగిపోతుండటం పట్ల హోం మంత్రి అమిత్ షా సైతం ఆందోళన వ్యక్తం చేసి.. నిన్న సాయంత్రం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే నగర హాస్పిటల్స్ లో 750 ఐ సీ యూ పడకలను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆ తరువాత ఇదే విషయాన్ని నిర్ధారించారు. రోజువారీ కరోనా టెస్టులను ప్రస్తుతమున్న 60 వేల నుంచి లక్షకు పెంచుతామని ఆయన తెలిపారు.