మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని టేక్మాల్ మండలం పాల్వంచలో కిరాణాషాపులో చోరీకి వచ్చిన దొంగ సజీవదహనమయ్యాడు. షాపులో చీకటిగా ఉందని అతడు అగ్గిపుల్ల వెలిగించడంతో ఘోరం జరిగింది. అగ్గిపుల్ల నిప్పురవ్వలు అక్కడే పెట్రోల్, డీజిల్, శానిటైజర్ బాటిల్స్ పై పడటంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా, బయటకు వచ్చే ఆస్కారం లేక ఆ మంటల్లోనే దొంగ ప్రాణాలు విడిచాడు. ఓనర్ షాపు తెరవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Also Read :
“పుస్తెల తాడు తాకట్టు పెట్టైనా”, పులస కొనేస్తున్నారు !
పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నం