కరోనా కష్టాలు.. ఆందోళనలో థియేటర్ యాజమాన్యాలు..
ఈ నెల 16వ తేది నుండి పుదుచ్చేరిలో కరోనా నిబంధనల మధ్య సినిమా థియేటర్స్ తెరుచుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జనం థియేటర్లకు వచ్చే విధంగా 25 శాతం టికెట్..
అన్‌లాక్ 5.0లో భాగంగా దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లను తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో థియేటర్‌లకు నారాయణ స్వామి సర్కార్ అనుమతించింది. దీనితో ఈ నెల 16వ తేది నుండి పుదుచ్చేరిలో కరోనా నిబంధనల మధ్య సినిమా థియేటర్స్ తెరుచుకున్నాయి. (Theatre Owners In Puducherry)
ప్రస్తుత పరిస్థితుల్లో జనం థియేటర్లకు వచ్చే విధంగా 25 శాతం టికెట్ ధరలను తగ్గిస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సినిమా థియేటర్స్‌లో 50 శాతం మాత్రమే ప్రేక్షకులు సినిమా చూసేలా థియేటర్ యాజమాన్యాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే కరోనా భయం కారణంగా థియేటర్లకు అనుకున్నంత మంది జనాభా రాకపోవడం.. శని, ఆదివారాల్లో కూడా కనీస సంఖ్యలో జనం లేకపోవడంతో థియేటర్ యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే గవర్నమెంట్‌కు చెల్లించే పన్నులు, కరెంటు చార్జీలలో రాయితీ కల్పించాలని థియేటర్స్ యజమాన్యాలు కోరుతున్నాయి.