డబ్ల్యూహెచ్‌వో అంతర్గ భేటీలో కరోనా వైరస్ గుట్టురట్టు.. నిలదీసిన నిపుణులు.. అసలు విషయం ఇదే.!

| Edited By: Ravi Kiran

Nov 12, 2020 | 10:03 PM

చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెంది ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా డబ్ల్యూహెచ్‌వో మీటింగ్ రికార్డ్స్ లీకవ్వడంతో అదే నిజమనిపిస్తుంది.

డబ్ల్యూహెచ్‌వో అంతర్గ భేటీలో కరోనా వైరస్ గుట్టురట్టు.. నిలదీసిన నిపుణులు.. అసలు విషయం ఇదే.!
Follow us on

చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెంది ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నో వైరసులు వ్యాప్తి చెందినా కరోనా స్థాయిలో వ్యాప్తి చెందకపోవడం గమనార్హం. కాగా, ఈ మహమ్మారి ధాటికి కోట్లాది మంది బాధితులుగా మిగిలారు. లక్షలాది మంది మాయదారి రోగానికి బలయ్యారు. అయితే, ఈ వైరస్ పుట్టుక గురించి శాస్త్రవేత్తల్లో ఎన్నో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది శాస్త్రవేత్తలు కరోనా వైరస్ వుహాన్ లోని ల్యాబ్ లో పుట్టి ఉండవచ్చని గతంలో అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా డబ్ల్యూహెచ్‌వో మీటింగ్ రికార్డ్స్ లీకవ్వడంతో అదే నిజమనిపిస్తుంది.

తాజాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్గత సమావేశాలకు సంబంధించిన లీకైన కొన్ని రికార్డింగులు, పత్రాలను పరిశీలిస్తే శాస్త్రవేత్తల అనుమానాలే నిజమని తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా విషయంలో వాస్తవాలను దాచిపెడుతోందని శాస్త్రవేత్తల్లో, ప్రజల్లో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కరోనా విజృంభించిన తొలినాళ్లలో ఆ సంస్థ ప్రతినిధులు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకూ, అంతర్గత సమావేశాల్లో వైద్యులు, శాస్త్రవేత్తలు, నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలకూ మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్టు వీటి ద్వారా వెల్లడవుతోంది. తద్వారా రికార్డింగులు బయటపడటంతో డబ్ల్యూహెచ్‌వో వ్యవహారశైలి మరోమారు చర్చనీయాంశంగా మారింది.

ప్రపంచ ప్రజల ఆరోగ్య విషయంలో డబ్ల్యూహెచ్‌వో పాత్ర ఎంతో కీలకం. సంస్థ ఇచ్చే మార్గదర్శకాలే ప్రపంచ దేశాలకు దిక్సూచి. అలాంటిది మాయదారి కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సంస్థ వ్యవహారశైలి ఎన్నో విమర్శలకు తావిచ్చింది. నిధులిచ్చే సభ్య దేశాలపై సంస్థ కఠినంగా వ్యవహరించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా 2.0 పంజా విసురుతున్న క్రమంలో సంస్థ అంతర్గత సమావేశాలకు సంబంధించిన రికార్డింగులు, పత్రాలు ఓ వార్తా సంస్థ చేతికి చిక్కాయి. విమర్శలను బలపరిచేలా ఉన్న ఆధారాలు లభ్యం కావడంతో… డబ్ల్యూహెచ్‌వోపై ప్రశ్నల వర్షం కురుస్తోంది.

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్గత సమావేశాలకు సంబంధించిన ఆడియో టేపులు లీక్ కాగా సమావేశంలో డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు ప్రయోగశాలలో ఆ వైరస్ పై అధ్యయనం చేయడం దురదృష్టం అంటూ డబ్ల్యూహెచ్‌వోకు చెందిన అత్యున్నత వైద్యులు, నిపుణులు అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానించినట్టు రికార్డింగుల్లో ఉన్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తం పెద్దచర్చకు తెర లేచింది. కరోనా జన్మస్థానమైన చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌ గురించే వారు మాట్లాడినట్టు భావిస్తున్నారు.

వైరస్‌ ప్రభావిత దేశాల్లో అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జపాన్‌ ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌వోకు వీటి నుంచి భారీగా నిధులు అందుతాయి. మహమ్మారి విషయంలో ఆ దేశాలు ఎన్ని తప్పులు చేసినా, డబ్ల్యూహెచ్‌వో పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటి వరకు ఎలాంటి నియంత్రణ చర్యలూ తీసుకోలేదు. ఫలితంగా ప్రపంచ దేశాలు తీవ్ర కష్టనష్టాలను చవిచూడాల్సి వచ్చింది. సభ్యదేశాలపై కఠినంగా వ్యవహరించి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదని ఈ సమావేశంలో సంస్థ నిపుణులు అభిప్రాయపడినట్టు రికార్డింగులు, పత్రాల ద్వారా తెలుస్తోంది.
కాగా, చైనా ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ అయిందని. ఈ విషయం తెలిసినా డబ్ల్యూహెచ్‌వో ప్రపంచానికి చెప్పడం లేదని తెలుస్తోంది. మరోవైపు సరైన సమయంలో డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించి ఉంటే ప్రపంచ దేశాల్లో ఈ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదయ్యేవి కాదని పలు దేశాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ నెల చివరినాటికి సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం…