అగ్రరాజ్యం అమెరికా హక్కుల ఉద్యమకారుడు ఇకలేరు
అగ్రరాజ్యం అమెరికాలో పౌర హక్కుల ఉద్యమకారుడు కార్డీ టిండెల్ వివియన్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 95 ఏళ్లు. గత కొద్ది రోజులుగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం..

అగ్రరాజ్యం అమెరికాలో పౌర హక్కుల ఉద్యమకారుడు కార్డీ టిండెల్ వివియన్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 95 ఏళ్లు. గత కొద్ది రోజులుగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురై.. అట్లాంటాలోని తన ఇంట్లోనే మరణించారు. వివయన్ పౌరహక్కుల ఉద్యమంలో దాదాపు అరవై ఏళ్లకు పైగా ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు. అమెరికాలోని పౌరహక్కుల పోరాట యోధుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌తో కూడా ఆయన కొద్ది రోజులు పనిచేవారు. అంతేకాదు.. మార్చిన్ స్థాపించిన సదరన్ క్రిస్టియన్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్‌కు వివియన్ అధ్యక్షుడిగా కొద్ది రోజులు ఉన్నారు.