ట్రిపుల్ తలాక్ చట్టం వివక్షపూరితంగా ఉందన్నారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ వివాహం చేసుకున్న కారణంగా జైలు శిక్ష అనుభవిచడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. వివాహం సివిల్ కాంట్రాక్ట్‌గా పరిగణిస్తే దాన్ని సివిల్‌గానే చూడాలితప్ప క్రైమ్‌గా చూడకూడదన్నారు. ఒకవేళ భర్త శిక్ష అనుభవిస్తున్న కాలంలో భార్యకు అందాల్సిన ఆర్ధిక సాయం ఏవిధంగా అందుతుందని మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. ఏదైనా చట్టం చేసేముందు ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తే దాని ఫలితాలు కూడా వ్యతిరేకంగానే వస్తాయన్నారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా మహిళా సాధికారితపై మిథున్‌రెడ్డి మాట్లాడారు.