Best Times to Drink Water: పుట్టుక మరణం మనచేతుల్లో లేదు.. కానీ ఆరోగ్యంగా సంతోషంగా జీవించడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. పోషకారం, సుఖ నిద్ర, మంచి అలవాట్లు మనం జీవినంత కాలం సుఖ సంతోషాలతో జీవించేటట్లు చేస్తాయి. అయితే మనం మంచి నీరు తాగుతూనే ఉంటాయి. అయితే నీరు ఎలా తాగాలి ఏ సమయంలో తాగాలి అనేది పెద్దగా పట్టించుకోము.. రోజూ నీరు తాగే విధానంపై హార్ట్ స్పెషలిస్ట్ చెప్పిన ఆరోగ్య సూత్రాలను గురించి తెలుసుకుందాం.
1. ఉదయ౦ మేల్కొన్న తర్వాత .. రెండు గ్లాసుల నీళ్ళు త్రాగండి. ఇది అంతర్గత అవయవాలను సక్రియం చేయడానికి సహాయపడుతుంది
2. భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాసు నీళ్ళు తాగడం వలన జీర్ణక్రియకు సహాయపడుతుంది
3. స్నానం చేయడానికి ముందు ఒక గ్లాసు నీళ్ళు త్రాగడ౦వలన రక్తపోటు తగ్గించడానికి సహాయపడుతుంది
4. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్ళు త్రాగడ౦ – స్ట్రోక్ లేదా గుండెపోటును నివారించవచ్చు
5. అదనంగా, రాత్రి మధ్యలో నీరు త్రాగడ౦ రాత్రి కాలు తిమ్మిర్లను నివారించడానికి సహాయపడుతుంది.
6. కాలు కండరాలు సంకోచించడ౦ (కొ౦కర్లు) చార్లీ హార్స్ (Charley Horse) లేక దూడ తిమ్మిరి అనే రోగ౦ మన శరీర౦లో నీటి శాత౦ తక్కువయినపుడు వస్తు౦ది. రోజ౦తా సరిగా నీళ్ళు తాగడ౦ వల్ల ఈ వ్యాధిని నిరోధించవచ్చు.
Also Read: మీ వివాహ మొదటి శుభలేఖ తిరుమల వెంకన్నకు ఇలా పంపించండి.. పెండ్లికానుక అందుకోండి