Thanku Brother Trailer Release: అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా ‘థ్యాంక్యూ బ్రదర్’. నూతన దర్శకుడు రమేష్ రాపర్తి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ఒక గర్భిణీ, తనతో ఒక యువకుడు లిఫ్ట్‌లో ఇరుక్కుపోతే.. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయన్న నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. 1.57 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ట్రైలర్ అద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇక ట్రైలర్‌ను గమనిస్తే అనసూయ తనలోని నట విశ్వరూపాన్ని చూపించిందని చెప్పాలి. అనసూయ ఇప్పటి వరకు నటించిన అన్ని పాత్రల కంటే ‘థ్యాంక్యూ బ్రదర్’లో తన నటన అదుర్స్ అనిపించేలా ఉంది. సరికొత్త కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా అనసూయకు ఎలాంటి అవకాశాలు తెచ్చి పెడుతుందో చూడాలి. ఇక ఈ ట్రైలర్‌ను ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ విడుదల చేయడం విశేషం. ట్రైలర్‌ను విడుదల చేసిన తర్వాత వెంకీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉందని తెలిపారు. అనసూయ లుక్ చాలా ఆసక్తికరంగా ఉందన్నారు. ప్రేక్షకులు ఈ సినిమాను కచ్చితంగా ఆదరిస్తారని, చిత్ర యూనిట్‌కు వెంకీ శుభాకాంక్షలు తెలియజేశారు. మరి ఆసక్తికరంగా ఉన్న ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి..
Also Read: Shradda Kapoor: పెళ్లికి సిద్ధమవుతోన్న ‘సాహో’ బ్యూటీ…? కూతురు పెళ్లిపై స్పందించిన శక్తి కపూర్..